April 26, 2015

Abraham Lincoln Telugu Quotations ........My Slideshow

Abraham Lincoln Telugu Quotations ........My Slideshow
I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)

అబ్రహాంలింకన్ హితోక్తులు 10

అబ్రహాంలింకన్ హితోక్తులు 10


అబ్రహాంలింకన్ హితోక్తులు 09

అబ్రహాంలింకన్ హితోక్తులు 09


అబ్రహాంలింకన్ హితోక్తులు 08

అబ్రహాంలింకన్ హితోక్తులు 08


అబ్రహాంలింకన్ హితోక్తులు 07

అబ్రహాంలింకన్ హితోక్తులు 07


అబ్రహాంలింకన్ హితోక్తులు 06

అబ్రహాంలింకన్ హితోక్తులు 06


అబ్రహాంలింకన్ హితోక్తులు 05

అబ్రహాంలింకన్ హితోక్తులు 05


అబ్రహాంలింకన్ హితోక్తులు 04

అబ్రహాంలింకన్ హితోక్తులు 04


అబ్రహాంలింకన్ హితోక్తులు 03

అబ్రహాంలింకన్ హితోక్తులు 03


అబ్రహాంలింకన్ హితోక్తులు 02

అబ్రహాంలింకన్ హితోక్తులు 02



అబ్రహాంలింకన్ హితోక్తులు 01

అబ్రహాంలింకన్ హితోక్తులు 01


April 20, 2015

Simhachalamu Mahapunyakshetramu

Simhachalamu Maha Punyakshetramu....సింహాచలము మహాపుణ్యక్షేత్రము
Sri Simhachala Kshetra Mahima(1955)...

April 18, 2015

Ganga Aarati at Kasi

Ganga Aarati at Kasi --- కాశీలో గంగా హారతులు 26 - 02 - 2015

Kamadgiri Parvat at Chitrakoot

Kamadgiri Parvat at Chitrakoot ...... చిత్రకూటంలో  కామత్ గిరి పర్వతం.......25 - 02 - 2015

Sphatikashila at Chitrakutam

Sphatikashila at Chitrakutam -- చిత్రకూటంలో స్ఫటికశిల యొక్క చరిత్ర

April 15, 2015

Shakespeare Quotations......My Slideshow

Shakespeare Quotations......My Slideshow........I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)

షేక్స్పియర్ సూక్తులు - 10

షేక్స్పియర్ సూక్తులు - 10


షేక్స్పియర్ సూక్తులు - 09

షేక్స్పియర్ సూక్తులు - 09


షేక్స్పియర్ సూక్తులు - 08

షేక్స్పియర్ సూక్తులు - 08


షేక్స్పియర్ సూక్తులు - 07

షేక్స్పియర్ సూక్తులు - 07


షేక్స్పియర్ సూక్తులు - 06

షేక్స్పియర్ సూక్తులు - 06


షేక్స్పియర్ సూక్తులు - 05

షేక్స్పియర్ సూక్తులు - 05


షేక్స్పియర్ సూక్తులు - 04

షేక్స్పియర్ సూక్తులు - 04


షేక్స్పియర్ సూక్తులు - 03

షేక్స్పియర్ సూక్తులు - 03


షేక్స్పియర్ సూక్తులు - 02

షేక్స్పియర్ సూక్తులు - 02


షేక్స్పియర్ సూక్తులు - 01

షేక్స్పియర్ సూక్తులు - 01


April 13, 2015

నమస్కారం అనేది మన భారతీయ సంస్కృతి

నమస్కారం అనేది మన భారతీయ సంస్కృతి 


ఏదేశ సంస్కృతి ఐనా ఆ దేశ ఆత్మ అయి ఉంటుంది. మన భారతీయ సంస్కృతి యొక్క మహత్తు చాలా గొప్పది. మన సంస్కృతిలో పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయాల వెనుక గొప్ప తాత్విక వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి. నమస్కారం అనేది భారతీయ సంస్కృతి యొక్క అపురూప రత్నం. భారతీయ సంస్కృతిలో నమస్కరానికి తనదైన ఒక స్థానం, మహత్తు ఉన్నాయి. పాశ్చాత్య సంస్కృతిలో ఏవిధంగా అయితే షేక్ హ్యాండ్ (కరచాలనం) ఇస్తారో- అదేవిధంగా మన భారతీయ సంస్కృతలో రెండు చేతులు జోడించి, తలను వంచి, ప్రాచీన పధ్ధతి ఉంది. నమస్కారానికి వేర్వేరు భావాలూ, అర్థాలు ఉన్నాయి. 

నమస్కారం అనేది ఒక ఉత్తమ సంప్రదాయం. ఎదుటి వానికి నమస్కారం చెయ్యటంలోనే తెలుస్తుంది మన సంస్కారమేమిటని. మనం మనకంటే పెద్దవారికి, తల్లిదండ్రులకి, సజ్జనులు, మహాత్ములని కలుసుకున్న సమయంలో వారి ఎదుట చేతులు రెండు జోడించి, తలను వంచితే, మనలో ఉండే అహంకారం పోయి మనసు నిర్మలమవుతుంది. 


నమస్కారం మూలంగా మన అహం ఏ యోగ్యుడి ఎదుటైనా తల వంచితే శరణాగత, సమర్పణ భావాలు  కలుగుతాయి. అన్ని మతాలలోనూ ఈ నమస్కార సంప్రదాయం ఉంది. క్రైస్తవ మతంలో ఛాతీపై చేతిని ఉంచి, తలను వంచుతారు. బౌద్ధులు కూడా తల వంచి ప్రణామం చేస్తారు. జైనులు కూడా తలవంచి నమస్కారం చేస్తారు. వైదిక ధర్మంలో నమస్కార పద్ధతే అన్నింటిలోకీ శ్రేష్టమైనది. రెండు చేతులనూ జోడించటం వల్ల జీవనశక్తిని, తేజోవలయాన్ని రక్షించే ఒక చక్రం ఏర్పడుతుంది. అటువంటి నమస్కారం విశేష లాభదాయకమైంది. ఎందుకంటే ఒకరి చేతులు మరొకరు అందుకోవటం వలన జీవశక్తి నశించి, ఒకరి రోగాలు మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.      

                                  

April 12, 2015

మహాభారత, భాగవత కాలంలో ప్రాచీన దేశాలు – ఆధునిక ప్రాంతాలు

మహాభారత, భాగవత కాలంలో ప్రాచీన దేశాలు – ఆధునిక ప్రాంతాలు


1)మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం
    -- దేవ్ ధాం ,నేపాల్

2) నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం 
    -- అహోబిలం , ఆంధ్రప్రదేశ్

3) జమదగ్ని మహర్షి ఆశ్రమం 
    -- జమానియా  ఉత్తర్ ప్రదేశ్

4) మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని ) 
    - మహేశ్వర్ ,మధ్యప్రదేశ్

5) శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్కమార్లు క్షత్రియులపై దండెత్తి వారిరక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు ) , కురుక్షేత్రం , దుర్యోధనుని చంపిన చోటు 
   -కురుక్షేత్ర , హర్యానా



6) పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలినిసముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం ) 
   - కేరళ ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం .



7) మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం ) 
   - పశ్చిమ ఒరిస్సా

8) నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం ) 
   - గ్వాలియర్ జిల్లా ,మధ్యప్రదేశ్

9) వ్యాస మహర్షి పుట్టిన స్థలం 
   - ధమౌలి , నేపాల్

10) నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం ) 
    - సీతాపూర్ జిల్లా , ఉత్తర్ ప్రదేశ్


11) వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు 
   - మనగ్రామం , ఉత్తరాంచల్


12) రతిష్టానపురం (పురూరవుని రాజధాని ) 
    - ఝాన్సీ ,అలహాబాద్

13) సాళ్వ రాజ్యం (సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం ) 
   - కురుక్షేత్రం దగ్గర

14) హస్తినాపురం (కౌరవుల రాజధాని ) 
    - హస్తినాపూర్ , ఉత్తర్ ప్రదేశ్

15) మధుపురం / మధువనం (కంసుని రాజధాని )
     - మధుర , ఉత్తర్ ప్రదేశ్

16) వ్రేపల్లె / గోకులం - గోకుల్ 
     -- మధుర దగ్గర


17) కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు ) 
    - గ్వాలియర్

18) మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు ) 
     - పంజాబ్ ప్రావిన్స్ , పాకిస్తాన్

19) ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం ) 
    - డెహ్రాడూన్

20) గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు ) 
    - గురుగావ్ , హర్యానా

21) కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం 
   - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్ )

22) పాండవుల లాక్షగృహ దహనం
   - వర్నాల్ , హస్తినాపూర్



23) కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం 
   - గిర్నార్ ,గుజరాత్

24) శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం 
   - ద్వారక , గుజరాత్
25) హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు ) 
-జలాన్ జిల్లా , ఉత్తర్ ప్రదేశ్

26) విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం ) 
   - విదర్భ , మహరాష్ట్ర

27) కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం ) 
   - కుండినపుర , మహరాష్ట్ర

28) చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం ) 
   - బుందేల్ ఖండ్ , మధ్యప్రదేశ్

29) కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం ) 
   - దాతియ జిల్లా , మధ్యప్రదేశ్

30) ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని ) 
  - ఇంద్రప్రస్థ , ఢిల్లీ దగ్గర


31)  కుచేలుడు నివసించిన చోటు 
   - పోర్ బందర్ , గుజరాత్

32) పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం ) 
   - ఎటాహ్ , సహజహంపూర్ , ఫారుఖాబాద్ ప్రాంతాలు , ఉత్తర్ ప్రదేశ్


33) కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం ) 
   - కంపిల్ , ఉత్తర్




34) జరాసంధుని భీముడు చంపిన చోటు 
    - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి , బీహార్


35) కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతాలు ) 
   - పశ్చిమ హర్యానా


36) మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం ) 
   - ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం ,రాజస్థాన్


37) విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం )
    - విరాట్ నగర్ , రాజస్థాన్


38) శోణపురం (బాణాసురుడి రాజధాని ) 
   - సోనిత్ పూర్ , అస్సాం

39) ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని ) 
   - తేజ్ పూర్ , అస్సాం

40) నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం 
   - ప్రభాస తీర్థం , సోంనాథ్ , గుజరాత్


41) జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం 
   - పర్హాం , ఉత్తర్ ప్రదేశ్


42) కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం ) 
   - నేపాల్ లోని తిలార్కోట్


43) బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం 
   - బోధ్(బుద్ధ) గయ , బీహార్


44) గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు 
    - కుశీనగర్ , ఉత్తర్ ప్రదేశ్


అమృతం అనే ఆయుర్వేద, ఆధ్యాత్మిక పత్రికలో ఉన్న ఈ points ని  నేను చదివాను, నాకు బాగా నచ్చాయి. అందుకే అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ భద్రపరచాను.