April 25, 2014

Brahmotsav 2014

Jai Shri Radhe -- Radhe!! Radhe!!
(బృందావనం రాధామాధవ దివ్యదేశ్ లో నాన్నగారు - తమ్ముడు చేయించిన బ్రహ్మోత్సవాల కార్యక్రమం.... మా పెద్దబ్బాయి చేసిన వీడియో ఇది) 
Now we are watching Brahmotsav of sri Radha Madhav Divya Desh. It was established by his holiness of Sri Swamy Anantacharya ji in a peaceful location at Vrindavan, Chaitany Vihar, Burja road with divine purpose and noble cause.

April 23, 2014

Thiruppavai 3va pasuram ...... తిరుప్పావై మూడవరోజు పాశురం

Thiruppavai 3va pasuram ...... తిరుప్పావై మూడవరోజు పాశురం
వ్యాఖ్యాత ..... ఇరగవరపు పద్మహాస చక్రవర్తి

Thiruppavai 2va pasuram .... తిరుప్పావై రెండవరోజు పాశురం

Thiruppavai 2va pasuram...... తిరుప్పావై రెండవరోజు పాశురం

Thiruppavai 1va Pasuram.... తిరుప్పావై మొదటి పాశురం

తిరుప్పావై మొదటి పాశురం
వ్యాఖ్యాత .... ఇరగవరపు పద్మహాస చక్రవర్తి

Radhe Radhe Radheshyam

Radhe Radhe Radheshyam

April 22, 2014

నృసింహజయంతి

నృసింహజయంతి

"వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధశ్యాం శుభేదినే l
సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భవ నృకేసరీ ll "

ఈరోజు నృసింహజయంతి...... అంటే హిరణ్యాక్షుని, నృసింహస్వామి సంహరించినరోజు. హిరణ్యాక్షుని అసురసంధ్యవేళ(సూర్యాస్తమయ సమయంలో) సంహరించెను కదా .....అంటే నృసింహస్వామి అవతారం ఈ సమయంలోనే జరిగింది కనుక .....ఈ రోజు ఈ సమయంలోనే నరసింహస్వామికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు, ఈ అసురసంధ్యవేళలోనే జరుపుతారు.

ఈ నృసింహజయంతి అనేది సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించినప్పుడు, శుద్ధ చతుర్ధశి నాడు జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ వృషభరాశి వైశాఖమాసంలో, ఒక్కొక్కసారి జ్యేష్ట మాసంలో వస్తుంది.

దేశంమొత్తంలో.... లేదా రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని నారసింహ క్షేత్రాలలో ఈ రోజు ఈ వేడుకను కన్నులపండుగగా జరుపుతారు.

సుందరాయ సుభాంగాయ మంగళాయ మహౌజసేl
సింహసైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం ll  


బేలూరు

బేలూరు


బేలూరు నగరం--కర్ణాటక రాష్ట్రం లో......బెంగుళూరుకు సమీపంలో ఉంది...

దక్షిణ బెనారస్ గా పేరు గాంచిన బేలూరు-- శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. జైన మరియు వైష్ణవ సంస్కృతికి ప్రతీకమైన ఈ పురాతన నగరం "వేలాపురి" అని కూడా పిలవబడేది.

బేలూరు నందు చెన్నకేశవ ఆలయం శిల్పకళకు ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ఉన్న శిల్పకళ, కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా... భారతదేశంలోనే ఉత్తమ శిల్పకళగా పేరొందినది. విష్ణువర్ధనుడు అనే హొయసల రాజు 1117 లో తన దిగ్విజయములకు స్మారకంగా ఈ చేన్నకేశవ ఆలయమును నిర్మించాడు. అందుకే ఇక్కడ దేవుడిని విజయనారాయణ అని కూడా పిలుస్తారు. దీనిని పూర్తిచెయ్యటానికి 103 సంవత్సరాలు పట్టిందట.

ఈ దేవాలయానికి వెలుపలి భాగంలో ఉన్న చిన్న గుడిలో షట్కోణాకారం లో సుదర్శన విగ్రహం ఉంది.... ఈ దేవస్థానం లో రెండు గర్భగుడిలు ఉన్నాయి. ఈ దేవాలయం ముఖద్వారం పైన, ఎత్తైన గోపురం కట్టబడి ఉన్నది.  బలిష్టతకు మరియు భద్రతకు సంకేతమైన ఏనుగుల వరుస.... దానిపైన సింహాల వరస....ఆపైన  రామాయణ -- మహాభారత దృశ్యాలు.... మధ్య - మధ్యలో హంసలు.... వివిధ భంగిమలలో చెక్కబడిన చిన్న చిన్న విగ్రహాలు..... ఈ విధంగా గోడల మీద చాలా ఆకర్షణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయానికి చుట్టూ 42 అందమైన శిల్పాలు మనం చూడవచ్చును.


ఒక శిల్పము యొక్క విశిష్టత ఏమిటంటే--- సుందరి మరియు చిలుక----ఒక శిల్పం ఎడమ చేతిలో ఉన్న చిలుకతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆమె కుడిచేతికి ఉన్న గాజులను మనం పైకి... క్రిందికి కదపవచ్చును. అంటే అప్పటి కాలంలో శిల్పుల నైపుణ్యం మనం చూసి తరించవలసిందే కానీ వర్ణించలేము.

చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రవేశించినంతనే జయవిజయుల విగాహాలను మనం చూడవచ్చును. గర్భగుడిలో ఉన్న రాళ్ళను...స్తంభాలను.... బంగారము మరియు రాగిరేకులతో  తాపడం చేసారు. గర్భగుడిలో ఉన్న చెన్నకేశవ స్వామి----మహావిష్ణువు అవతారములలో ఒకటైన -- మోహినీ అవతార రూపంలో... పట్టు చీర మరియు ముక్కుపుడక... పూలను ధరించిన రూపంలో మనకు దర్శనమిస్తాడు...స్వామికి ఇరుపక్కల దేవేరులు ఇద్దరూ కొలువు తీరి ఉన్నారు.

ఈ దేవాలయమునికి దక్షిణభాగంలో.... కప్పెచెన్నగరాయ అనే దేవాలయం ఉంది. చాలా ఆకర్షణీయంగా కనబడుతున్న కప్పెచెన్నగరాయ విగ్రహాన్ని విష్ణువర్ధన మహారాజు యొక్క పట్టపురాణి శాంతలాదేవి ప్రతిష్టించారు. ఈ దేవాలయానికి పేరు ఎలా వచ్చింది అనటానికి, ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది.

అమరశిల్పి జక్కన్న తన స్వగ్రామాన్ని వదిలిపెట్టి దేశపర్యటన చేస్తూ బేలూరుకి చేరుకొని, అక్కడ జరుగుతున్న దేవాలయ నిర్మాణంలో కార్యక్రమంలో నిమగ్నుడై ఉంటాడు. అతని కుమారుడైన డంకణాచారి కూడా మంచి శిల్పి అని పేరు తెచ్చుకొని బెలూరుకి చేరుకుంటాడు...... ఐతే తనతండ్రి ఒక శిల్పి అని తెలియదు. జక్కన్న ఈ దేవుని విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో.....డంకణ ఈ విగ్రహంలో చిన్న లోపం ఉన్నదని తెలుసుకొని చెబుతాడు. కానీ జక్కన్న దీనిలో లోపంలేదు...... లోపాన్ని చూపితే తనచేతిని నరుక్కుంటాను అని అన్నాడు. అర్చకులు ఆ లోపాన్ని పరీక్షించుటకు విగ్రహానికి చుట్టూ గంధాన్ని పూసి ఎండబెడతారు. చివరకు గంధం అంతా ఎండిపోయి.... లోపం ఉన్నచోట ఎండకుండా తడిగా ఉంటుంది. అక్కడ పగులగొట్టగా జీవమున్న కప్పు కనిపిస్తుంది. అందువలన ఈ విగ్రహానికి కప్పెచెన్నగరాయ అని పేరు వచ్చింది.... దేవాలయానికి కూడా అదే పేరు సార్థకమయ్యింది. అనంతరం జక్కన్న తన చేతిని నరికించుకుంటాడు..... ఆపై ఆ యువశిల్పి తన కొడుకు అని తెలుసుకొని సంతోషపడతాడు....

తరవాత జక్కన్న-- కొడుకుతో  తన స్వగ్రామానికి తిరిగివచ్చి.... కొడుకు సాయంతో చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని చెక్కుతాడు..... విగ్రహం పూర్తిఅయ్యిన వెంటనే జక్కన్నకు తనచెయ్యి తిరిగివచ్చిందని చెబుతుంటారు..... ఈ సందర్భంగా ఆ ఊరికి కైదాళ అనే పేరు వచ్చింది. కైదాళ అంటే పోయినచేయ్యి తిరిగివచ్చుట అని అర్థం.

ఈ చేన్నకేశవ ఆలయంలో చాలావరకు శిల్పాలు జక్కన్న చెక్కినవే అని చెబుతారు.

చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో విచిత్రమైన  42 అడుగుల ఎత్తు ఉన్న ఒక స్తంభం ఉన్నది. ఇది ఏకశిలతో చెక్కబడినది. మరియు తనభారాన్ని తానే మోసుకుంటున్నది. దీనిని గురుత్వాకర్షణ స్థంభం అంటారు.


శ్రీ హనుమత్ జయంతి:--

శ్రీ హనుమత్ జయంతి


ఆంజనేయ స్వామి జననం----వైశాఖమాసం... కృష్ణపక్షం.... దశమి.... శనివారం.... పూర్వాభాద్ర నక్షత్రం లో జరిగింది..... అంజనాదేవి---కేసరీ దంపతులకు.... వాయుదేవుని వరప్రభావముచే ఆంజనేయుడు జన్మించాడు.

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||

అంజనానందం వీరం జానకీ శోకనాశనం l
కపీసమక్ష హంతారం వందే లంకా భయంకరం ll  

ఆంజనేయుడు పుట్టిన కొద్ది దినములలోనే సూర్యుని పండుగా భ్రమించి, మింగబోవగా... ఇంద్రుడు వజ్రాయుధముతో అనువు(దవడ) మీద కొట్టగా స్పృహ కోల్పోగా.... వాయుదేవునికి కోపంవచ్చి.... ఆంజనేయుని తీసుకొని ఎవరికీ కానరాక దాగియుండెను.... ఆ సమయంలో లోకములలో గాలి ఆడక.... జీవులన్నీ.....కటకటలాడిపోవగా,  అప్పుడు బ్రహ్మాది దేవతలంతా ప్రత్యక్షమయ్యి......ఆంజనేయుడు చిరంజీవి అనియు---విశేష పరాక్రమశాలి అనియు వరములిచ్చి "హనుమ" అని పిలిచి--- వాయుదేవుని శాంతింపజేసిరి.... అప్పటినుండి ఆంజనేయునుని.... హనుమంతుడు అని పిలిచారు. ఇంకా వాయునందనుడు, పవనపుత్రుడు, కేసరీతనయుడు, అంజనా నందుడు, రామబంటు, మొదలైన పేర్లతో పిలవబడతాడు.



హనుమాన్ అంజనాసూనుహు వాయుపుత్రో మహా బలహ l
రామేస్ట ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః l
ఉదధిక్రమణేశ్చైవ సీతాశోక వినాశకః l  
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య  దర్పహా ll

ఈ ద్వాదశ నామాలు అనునిత్యం త్రికాలములలో జపిస్తే శత్రుభయం అనేది ఉండదు.  

హనుమంతుడు... సూర్య భగవానుని వద్ద శిష్యునిగా చేరి... చతుర్వేదాలు నేర్చుకున్నాడు. సుగ్రీవునికి మంత్రిగా ఉండి, రామ--సుగ్రీవులకు మైత్రిని నెలకొల్పాడు. సీతాన్వేషణకు కూడా ముఖ్య పాత్రధారి ఇతనే.


హనుమకి సింధూరం అంటే ప్రీతి...... ఎందుకంటే....ఒకనాడు  సీతమ్మవారు నుదిటన సింధూరం ధరించగా హనుమ ఇలా అడిగాడంట.... అమ్మా నుదిటన సింధూరం ఎందుకు ధరించారు అని...... అప్పుడు సీతమ్మ ఈ విధంగా సమాధానం ఇచ్చారు......నుదిటన సింధూరం ధరిస్తే నా పతికి మంచి జరుగుతుంది అని. వెంటనే హనుమ---ఐతే నేను నా వళ్ళంతా సింధూరం పూసుకుంటాను అలా ఐతే నాస్వామికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని అన్నాడు.... అదిగో అప్పటినుండి హనుమకు వాళ్ళంతా సింధూరం పూస్తారు. స్వామికి తమలపాకులన్నా ప్రీతి ఎక్కువ....


హనుమకు వాహనం 'ఒంటె".

ఆంజనేయ పూజితస్చేత్  పూజితా సర్వదేవతాః l
హనుమన్మహిమా శక్యో  బ్రహ్మణాపిన వర్ణితుమ్ ll

భావం:-
ఆంజనేయస్వామిని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే. బ్రహ్మ దేవుడు కూడా వర్ణింపజాలని మహిమ హనుమన్మహిమ.

హనుమ గూర్చి మనమెంత చెప్పుకున్నా తక్కువే.... అతని గురించి చెప్పుకుంటే.... అతనిముందు మనం కుప్పిగంతులేసినట్లే...


శ్రీరామ జయరామ జయజయరామ 

యక్ష ప్రశ్నలు – సమాధానాలు

యక్ష ప్రశ్నలు – సమాధానాలు (2 భాగం)

1) సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?

బ్రహ్మం

2)  సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?

దేవతలు

3) సూర్యుని అస్తమింపచేయునది ఏది?

ధర్మం

4) సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
సత్యం

5) మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?

వేదం

6) దేనివలన మహత్తును పొందును?

తపస్సు

7) మానవునికి సహయపడునది ఏది?

ధైర్యం

8) మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?

పెద్దలను సేవించుటవలన

9) మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?

అధ్యయనము వలన

10) మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?

తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.

11) మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?

మౄత్యు భయమువలన

12) జీవన్మౄతుడెవరు?

దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు

13) భూమికంటె భారమైనది ఏది?

జనని

14) ఆకాశంకంటే పొడవైనది ఏది?

తండ్రి

15) గాలికంటె వేగమైనది ఏది?

మనస్సు

16) మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?

ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది

17) రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?

అస్త్రవిద్యచే

18) రూపం ఉన్నా హౄదయం లేనిదేది?

రాయి

19) మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?

శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన

20) బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?

సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు.

21) ధర్మానికి ఆధారమేది?

దయ దాక్షిణ్యం

22) కీర్తికి ఆశ్రయమేది?

దానం

23) దేవలోకానికి దారి ఏది?

సత్యం

24) మనిషికి ఆత్మ ఎవరు?

కూమారుడు.

25) మనిషికి దేనివల్ల సంతసించును?

దానం

26) లాభాల్లో గొప్పది ఏది?

ఆరోగ్యం

27) దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?

మనస్సు

28) ఎవరితో సంధి శిధిలమవదు?

సజ్జనులతో

29) లోకాన్ని కప్పివున్నది ఏది?

అజ్ణ్జానం

30) మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?

వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో


శ్రీ మారుతీ స్తోత్రం

శ్రీ మారుతీ స్తోత్రం

ఓం ---నమో వాయుపుత్రాయ భీమరుపాయ ధీమతే

న -- మస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే

మో -- హశోకవినాశాయ సీతాశోక వినాశినే

భ -- గ్నా శోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే

గ -- తినిర్జితవాతాయ లక్ష్మణ ప్రాణదాయచ

వ -- నౌకసాం వరిష్టాయ వశినే వనవాసినే

త -- త్వజ్ఞాన సుధాసిందు నిమగ్నాయ మహీయసే

అం -- జనేయాయ శూరాయ సుగ్రీవసచివాయచే

జ -- న్మమృత్యుభయగ్నాయ సర్వక్లేశ హరాయచ

నే -- నేధిస్టాయ మహాభూత ప్రేత భీత్యాది హారిణే

యా -- తనా నాసనాయాస్తు నమో మర్కట రూపిణే

య -- క్షరాక్షస శార్థూల సర్పవృశ్చిక భీహృతే

మా -- మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధ్రుతే

హా -- రిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే

బ -- లినామగ్ర గణ్యాయ నమో పాప హరాయతే

లా -- భదోసి త్వమేవాసు హనుమాన్ రాక్షసాంతక

య -- శోజయంచ మేదేహి శత్రూన్నాశాయ నాశాయ

స్వా -- శ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిం

హా -- హాని కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్


మానవ ధర్మం --- మన ధర్మం

మానవ ధర్మం --- మన ధర్మం

అన్ని జన్మలలోనూ మానవజన్మ ఉత్తమమైనది. అలంటి జన్మను పొందటం ఆజీవి చేసుకున్న పుణ్యఫలం.

"ప్రాణినాం నరజన్మ దుర్లభం" , "దుర్లభో మానుషోదేహః" , "నరత్వం దుర్లభంలోకే". అనే ఆరోక్తులు మానవజన్మను పొందటం ఎంత అదృష్టమో వివరిస్తున్నాయి. మంచి, చెడులను తెలుసుకొనే విచక్షణాజ్ఞానం , ఆపదల నుండి విముక్తిని పొందే ఆలోచనాశక్తి, సమస్యలను పరిష్కరించుకొనే మేధాశక్తిని కల్గిన మానవుడు ఐహిక ఆనందంతో పాటు పారమార్థిక శ్రేయస్సును కూడా పొందాలి.

"ఆహార నిద్రాభయమైధునంచ సమాన మేతత్ పశుభిర్నరాణం l
ధర్మోహితేషామధకోవిశేషః ధర్మేణహీనా పశుభిస్సమానాః  ll"                    

ఆహారాన్ని స్వీకరించటం, నిద్రించటం, భయాందోళనలు చెందటం , సంతానాన్ని పొందటం, వంటివి, పశువులకు -- మనుష్యులకు సాదృశ్యధర్మాలే. తన ధర్మాన్ని తెల్సుకోవటం,  ఆచరించి జన్మను సార్థకం చేసుకోవటమే మనిషి విశిష్టత.

ఒకనాడు ఒకయోగి పుంగవుడు నదీతీరాన వెడుతూ ఉండగా, ఒక తేలు నీళ్ళలో కొట్టుకొనిపోతూ ఉంది. దానిని చూచినా ఆ యోగిపుంగవుడు తన చేతిని చాచి, నీళ్ళనుండి రక్షించే ప్రయత్నం చేసాడు.  ఆ తేలు అతన్ని కుట్టింది. వెంటనే బాధతో నీళ్ళలోకి వదిలేశాడు. మళ్ళీ అదే రీతిలో తేలుని రక్షించే యత్నం చేయగా మళ్ళీ అది  అతనిని కుట్టింది. మళ్ళీ వదిలేశాడు. ఇలా నాలుగైదుసార్లు చేస్తూ ఉండగా, ఒక బాటసారి ఆ యోగిని చూసి "ఆర్యా ! మీరు జ్ఞానుల వాలే ఉన్నారు. ఆ తేలు మళ్ళీ మళ్ళీ కుడుతూ ఉన్నా మూర్ఖంగా అదే ప్రయత్నాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు ???" అని అడుగగా,  అపుడు ఆ యోగి  "నాయనా ! కుట్టటం దాని ధర్మం ---- రక్షించటం మనధర్మం కదా ! దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తోంది.  ధర్మాన్ని నేను ఎలా విడిచిపెట్టగలను???" అని సమాధానం ఈయగా , ఆ బాటసారి మానవధర్మంలోని అంతరార్థాన్ని తెల్సుకొని వెళ్ళిపోయాడు.

ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి అన్న అర్థం ఈ క్రింది శ్లోకంలో మనకు తెలుస్తుంది.

ధర్మాధర్థం ప్రభవతే ! ధర్మాత్ ప్రభవతే సుఖం !
ధర్మేణసాధ్యతే సర్వం, ధర్మ సంసారమిదం జగత్ ll

ధర్మాచరణ వలన అర్థ ప్రాప్తి , ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మము యొక్క సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. ఆదర్శపుత్రునిగా గరుక్మంతుడు మాతృసేవలో తన పుత్రధర్మాన్ని ఆచరించి "మాతృదేవోభవ" అన్న మంత్రానికి సార్ధక్యం చేకూర్చాడు. తండ్రికోరిక మేరకు బ్రహ్మచర్యం ద్వారా భీషణ ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు "పితృదేవోభవ" అన్న మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి చూపాడు. "ఆచార్యదేవోభవ" అన్న మంత్రాన్ని ఆరుణి, ఉపమన్యుడు, ఉరంకుడు అనే ఆదర్శ శిష్యులు.   "అతిధిదేవోభవ" అన్న మంత్రాన్ని రంతిదేవుడు, రఘుమహారాజు , మానవులుగా ఆచరిస్తే, కపోతము తన జీవితాన్ని అర్పించి, గృహస్థు ధర్మాన్ని నిరూపించింది.

ఓం తత్ సత్                                          


కీర్తన భక్తి

కీర్తన భక్తి

భగవంతుని నామ రూప గుణ చరిత తత్వ రహస్యాలను, శ్రద్ధతో, ప్రేమతో కీర్తిస్తూ ఉంటే శరీరం పులకించటం, కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడటం, కంఠం తన్మయత్వంతో గద్గదమవ్వటము, హృదయ ప్రఫుల్లమై విలసిల్లటమే...కీర్తన లక్షణం.

పూర్వం నారదుడు, వాల్మీకి, శ్రీశుకుడు వంటి భక్తాగ్రేసరులు..... ఈ యుగంలో తులసీదాసు, సూరదాసు, తుకారం, మీరభాయ్, నానక్ వంటి ఎందరో భక్తులు కీర్తనభక్తి వలన తరించారు.

నిరంతరం నామకీర్తనలు గావించిన ప్రహ్లాడునుకి, నామకీర్తనతో పాటు, శ్రీరాముని తన హృదయంలో నిలుపుకున్న , హనుమంతునకు సాయుధ్యాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు.

కలియుగంలో శ్రీహరి నామమే సర్వశ్రేయోదాయక సాధనం.

శ్రీరామదాసు, అన్నమయ్య, త్యాగయ్య , క్షేత్రయ్య, జయదేవుడు మొదలైనవారు కలియుగంలో కీర్తనభక్తివల్లననే ముక్తిని పొందారు.


పూరీ క్షేత్ర చరిత్ర

పూరీ క్షేత్ర చరిత్ర



ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దైవ భక్తుడు. నీలాచలం అనే పర్వతం మీద జగన్నాథ స్వామి సుభద్రా బలరాముల తోడి వెలసి యున్నాడని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకున్న ఆయన వారిని దర్శించడానికి అక్కడికి వెళతాడు. జగన్నాథుడు ఆయన భక్తిని పరీక్షించాలని అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. రాజు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగి స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటాడు. ఒక రోజు కలలో రాజుకు జగన్నాథుడు కనిపించి సముద్రపు అలల్లో రెండు కొయ్య దుంగలు ఒడ్డుకు కొట్టుకు వస్తాయనీ వాటి నుంచి తమ విగ్రహాలను చెక్కించమని కోరాడు.
అలా కొట్టుకువచ్చిన కొయ్యలను రాజు వెలికితీసి రాజ్యం లోకి తీసుకెళ్ళగానే సాక్షాత్తూ విశ్వకర్మ యే శిల్పి రూపమున వచ్చి తాను ఆ దారువులలో దేవతా మూర్తులను చెక్కెదనని అభయమిచ్చాడు. కానీ ఆయన ఒక నియమం పెట్టాడు. ఆయన చెప్పేవరకూ ఎవరూ ద్వారములు తెరువ కూడదని కోరాడు.దాని ప్రకారం ఆయన ఒక గదిలో చేరి తలుపులు బిగించి శిల్పాలు చెక్కుతాడు.  పని ప్రారంభించి పది రోజులైంది.

ఒక రోజు రాజమాత లోపల యున్న శిల్పి పది రోజులుగా భోజనం లేకుండా ఉంటాడని భావించి తలుపులు తెరవమన్నది. తల్లి మాట కాదనలేని రాజు అలాగే తలుపులు తెరిపించాడు. కానీ అక్కడి శిల్పి అదృశ్యమయ్యాడు. అప్పటికే చేతులూ, కాళ్ళు తప్ప మిగతా భాగాలన్నీ పూర్తయ్యాయి. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను ఏమిచేయాలో రాజుకు తోచలేదు. వాటిని అలాగే ప్రతిష్టించాలను దైవవాణి ఆజ్ఞాపించడంతో విగ్రహాలను అలాగే ప్రతిష్టించారు.



రథయాత్ర



ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.


భగవన్నామ సంకీర్తన మహత్యము

భగవన్నామ సంకీర్తన మహత్యము

వైకుంఠనాథుడైన ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని వారి పిల్లలకో లేక ఇంకెవరికో పెట్టిన పేరుగా పలికినా, లేక ఎవరినైనా వెక్కిరించడానికి పలికినా, ఏదో ఊత పదంగా పలికినా, అది వారి యొక్క సమస్త పాపాలను నసింపచేస్తుందట. ఇంతటి మహత్తరమైన ఆ నారాయణ నామాన్ని స్మరింపక, కీర్తింపక ఎంత నష్టపోతున్నాము. పరమాత్మకి గానమంటే ప్రాణమట. ఆ శ్రీహరి నామం ఎలా తలచినా ఇంత ఫలితమిస్తుందంటే.........ఆయనకు ప్రాణమైన గానాన్నే మనం చేస్తే ఇంకెంత ఫలితమో తెలుసుకోవాలి. అది కోరికలు తీర్చటం కాదు.... స్వయంగా పరమాత్మనే ఇక్కడకు రప్పిస్తుందట. ఆ మాట ఆ పరమాత్మే స్వయంగా నారదునితో చెప్పాడంట.

నాహం నాసామి వైకుంఠె యోగినాం హృదయేనచ l
మద్భక్తా యత్రగాయన్నిత తత్ర తిష్టామి నారదా ll

నారదా ! నేను ఎక్కడ ఉంటానో తెలుసునా ? అంతా  నేను వైకుంఠములో ఉంటాననుకుంటున్నారు... కానీ నేను వైకుంఠములో లేను, ఉండను.... కొంతమంది నేను తపశ్శక్తి సంపన్నులైన యోగుల హృదయాలలో కనబడుతుంటానని అనుకుంటుంటారు. అక్కడా నేను కనబడను. ఎక్కడైతే నా నామస్మరణ చేస్తూ, నా భక్తులు గానం చేస్తుంటారో, నేను అక్కడే ఉంటాను...అని చెప్పారంట. అందుకేనేమో నారద మహర్షుల వారు ఆ నారాయణ నామస్మరణ గానాన్ని వీడకుండా గానం చేస్తుంటాడు. ఈ హరినామ గానం చేస్తే ఆయన ప్రసన్నుడై, ముక్తిని ప్రసాదిస్తాడంట.

హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం l
కలే నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ  గతిరన్యధా ll

ఈ కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందాలి అంటే ఈ హరినామ సంకీర్తన కంటే సులభమైన మరోమార్గం లేనేలేదంట.

ఈరోజునుంచే భగవన్నామ సంకీర్తనం ప్రారంభించండి. ఒకవేళ మనం రేపే ప్రయాణమవ్వవలసి వస్తుందేమో. అప్పుడు మోక్షాన్ని పొందలేక.... మళ్ళీ జన్మమెత్తవలసి వస్తుంది.


(స్త్రీల గురించి) కొన్ని సామెతలు

(స్త్రీల గురించి) కొన్ని సామెతలు

   "తలలు బోడులైతే తలపులు బోడులా!"

   "కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండదు"

  "అత్తలేని కోడలుత్తమురాలు - కోడలు లేని అత్త గుణవంతురాలు"

  "అత్త ఏలిన కోడలు చిత్తబట్టిన వరి"

  "అత్తగారింటి సుఖం మోచేతి దెబ్బవంటిది"

  "అత్తపేరు పెట్టి కూతుర్ని కుంపట్లో తోసిందట"

 "అంగడి మీద చేతులు అత్త మీద కన్ను"

 "అత్తను కొడితే కోడలు ఏడ్చిందట"

  "రొద్దానికి ఎద్దును పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు"

  "కూతురు కనలేకపోతే కొడుకు  మీద విరుచుకుపడ్డాట్ట"

  "కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందట"

  "సారె పెట్టకుండా పంపేను కూతురా, నోరుపెట్టుకుని బ్రతకమందట"

  "కాలు జారితే తీసుకోవచ్చుగానీ నోరు జారితే తీసుకోలేము"


April 7, 2014

Bommala Balala Ramayanam-----బొమ్మల బాలల రామాయణం

Bommala Balala Ramayanam -------- బొమ్మల బాలల రామాయణం

రామావతార మాధుర్యం

రామావతార మాధుర్యం 


శ్రీరాముడు రాశీభూతమైన ధర్మం. త్రేతాయుగంలో భూమిపై నడచిన సత్యం. మానవరూపంలో భాసించిన నైతిక మహాత్వం. అసురశక్తులపై ఎక్కుపెట్టిన మహాస్త్రం. శ్రీరాముణ్ణి ఆదర్శ పురుషునిగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ కుమారునిగా, ఆదర్శ జనకుడిగా -- మహాకవి, ద్రష్టయైన వాల్మీకి మహర్షి అభివర్ణించారు. శ్రీరాముడు అవతారంగా మహిమలు ఏమీ చూపించలేదు. మానవతా తేజస్విగా - మానవమాధుర్యాన్ని అందరికీ పంచిపెట్టాడు. శ్రీరామచంద్రుడు, శ్రీరామాయణం లేని మన పుణ్య భారతావనిని, వేదభూమిని మనం ఊహించలేము. 

చైత్రశుద్ధ నవమినాడు అయిదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న శుభసమయంలో పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో, పగటిపూట, కౌసల్య గర్భాన్న జన్మించాడు మన శ్రీరామచంద్రుడు. 'రామ' అంటే 'రమించుట' అని అర్థం. ఋషుల మనస్సును ఆనందపరవశం చెందిస్తాడు కనుక శ్రీరాముడు ఆరాధ్యదైవం అయ్యాడు. 

శ్రీరాముడు రజస్తమోగుణాలను అణచివేసి, సత్వమనసును సుస్థిరపరచాడు. వివాహ వ్యవస్థ, అనురాగ బంధాల మధురిమ తెలియని యుగంలో - కోతులుగా, రాక్షసులుగా బ్రతికే జనారణ్యంలో చక్కని నైతిక, ధార్మిక వ్యవస్థను శ్రీరాముడు నెలకొల్పాడు. 

శ్రీరాముడి సత్యనిష్ఠను నిరూపించే ఘట్టం ఒకటి రామాయణంలో మనకు కనిపిస్తుంది. ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తుండగా, లక్ష్మణుడు ఎన్ని బాణాలు ప్రయోగించినా ఫలితం లేకపోయింది. చివరికి లక్ష్మణుడు ఒకబాణం తీసి 'శ్రీరాముడు సత్యవాక్పరిపాలకుడైతే, ఈ బాణం ఇంద్రజిత్తును హతమార్చుగాక' అంటూ దాన్ని ప్రయోగిస్తాడు. ఆ బాణ ఘాతానికి ఇంద్రజిత్తు నేలకూలుతాడు. 

శ్రీరాముడు జటాయువుకు మోక్షం ఇచ్చి, తానూ అవతారంగా బయటపడిపోయాడని కొందరు భావిస్తారు. జటాయువుకు మోక్షం ఇచ్చింది రాముడు కాదు. సత్యస్వరూపమైన రాముని మాటలే మోక్షం ఇచ్చాయి. ఎవరైనా సత్య వ్రతాన్ని పాటిస్తే వారి మాటలు నిజమౌతాయంటారు. 


మానవులని ప్రేమించటానికి, భక్తులనుంచి ప్రేమను పొందటానికి, భగవంతుడు భూమికి దిగివస్తాడు. గుహుడు, శబరి చూపిన భక్తి, ప్రేమతత్పరతలను తనివితీరా అనుభవించటం కోసం శ్రీహరి -- శ్రీరాముడై ఈ భువిపైన అవతరించాడు. శ్రీరాముడు దయార్ధహృదయుడు. గుహుణ్ణి మనసారా కౌగిలించుకున్నాడు. గుహుడు పూర్వజన్మలో ఋషికుమారుడు. అతని తండ్రి లేని సమయంలో ఒక రాజు వచ్చి, తాను చేసిన పాపాలకు నివృత్తి చూపమని అతన్ని వేడుకొనగా, అప్పుడతను 'రామ రామ రామ' అని మూడుసార్లు ఉచ్ఛరిస్తే పాపాలు నశిస్తాయి అని చెప్పాడు. రాజు సంబరపడి వెళ్ళిపోయాడు. అంతలో ఆ యువకుని తండ్రి వచ్చి, ఎవరు మనింటికి వచ్చారు?' అని అడుగగా, కుమారుడు అసలు విషయం చెప్పాడు. తండ్రి కోపంతో 'నువ్వు తప్పుచేసావు. రామమంత్రము ఒక్కసారి ఉచ్ఛరిస్తే చాలు. పాపాలు పోతాయి. నువ్వు చేసిన పొరపాటుకు నిన్ను శపిస్తున్నాను. నువ్వు నిమ్నజాతిలో జన్మిస్తావు.' అని శపించిన కారణంగా గుహునిగా ఈజన్మలో జన్మించాడు. అతని శాపమే అతనికి వరమై, సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్నే దర్శించాడని రామాయణం మనకు చెబుతుంది. 


శ్రీరాముడు పరిమితిలేని కారుణ్యమూర్తి. తనను ద్వేషించిన వారిని సైతం చంపకుండా వదిలేసే ప్రేమతత్వం ఆయనది. యుద్ధభూమిలో రావణుడు ఓడిపోగా, యుద్ధభూమిని విడిచివెళ్ళి, మర్నాడు మళ్ళీ రమ్మనమని చెబుతాడు. రాత్రంతా ఆలోచించి, రావణుడు తనమనస్సును మార్చుకొని, సీతను తనంత తానుగ తిరిగి ఇస్తాడని రాముని ఆశ. అప్పుడు రావణున్ని చంపకుండా విడిచిపెట్టాలని రాముని ఊహ. రావణుడు మారడు. ఫలితం మరణం. రావణునికి అంత్యక్రియలు జరపటానికి విభీషణుడు తిరస్కరించాడు. కానీ, తానూ అంత్యక్రియలు చేస్తానని రాముడు ముందుకు వచ్చాడు. ఈ చర్యతోనైనా రావణుని ఆత్మకు విమిక్తి కలిగించాలని అతను భావించాడు. తనను కాపాడటానికి రాముడు చేసే ప్రయత్నాలను రావణుడు ప్రతిఘటించాడు. ఇప్పుడు అతను మరణించాడు కనుక అతణ్ణి విముక్తం చేయవచ్చు. అదీ శ్రీరాముని దయాదృష్టి. 


రాముడిపై విజయానికి, సార్వభౌమత్వానికి రావణుడి మనసు, అహంకారం పోరాటం సాగించాయి. వైకుంఠానికి త్వరగా తిరిగివెళ్ళి భగవంతునికి సేవకుడిగానే జీవించాలని అతడి ఆత్మ తొందరపెట్టింది. రావణుడు దగ్గరిదారి ఎంచుకొని, భీషణ శతృత్వంతో దైవానికి ఎదురుతిరిగాడని కొందరి  ప్రముఖుల అభిప్రాయం.

'నువ్వు విష్ణు అవతారివి, తిరిగి వైకుంఠానికి వచ్చేయ్' అని దేవతలు రావణ వధ అనంతరం కోరినప్పుడు, నేను భూమిని విడిచి రాను. నేను దశరథ కుమారుణ్ణి. అని అంటాడు శ్రీరాముడు. దేవతలు కోరినంతమాత్రాన తన అవతారాన్ని చాలించదలుచుకోలేదు. రాముడు. అటు తరువాత 11000 సంవత్సరాలు శ్రీరాముడు జీవించి, భూమిని పునీతం చేసాడని మనం చదువుకున్నాం. శ్రీరామనామం ప్రణవనాద సుధార్ణవమే రాముడై ప్రవహించింది, ప్రతిధ్వనించింది, నిత్యమంత్ర ధ్యానమై భక్తులకు మోక్షద్వారాలు తెరచింది. 

శ్రీరామ జయరామ జయజయ రామ 


April 5, 2014

భారతీయ ఔన్నత్యం ----- మార్క్ ట్వైన్

భారతీయ ఔన్నత్యం ---- మార్క్ ట్వైన్


భారతీయ ఔన్నత్యం ---- ఎర్విన్ ష్రోడింగర్

భారతీయ ఔన్నత్యం ---- ఎర్విన్ ష్రోడింగర్


భారతీయ ఔన్నత్యం ---- క్వీన్ ఫ్రెడ్రిక

భారతీయ ఔన్నత్యం ---- క్వీన్ ఫ్రెడ్రిక


భారతీయ ఔన్నత్యం ---- క్వీన్ ఫ్రెడ్రిక

భారతీయ ఔన్నత్యం ---- క్వీన్ ఫ్రెడ్రిక


భారతీయ ఔన్నత్యం ---- రాల్ఫ్ వాల్డో ఎమర్సన్

భారతీయ ఔన్నత్యం ---- రాల్ఫ్ వాల్డో ఎమర్సన్


భారతీయ ఔన్నత్యం ---- ఆర్థర్ షోపెన్ హావర్

భారతీయ ఔన్నత్యం ---- ఆర్థర్ షోపెన్ హావర్


April 2, 2014

భారతీయ ఔన్నత్యం ..... పియరె లోటి

ఆత్మలను, దైవాలను, దేశాలను నాశనం చేస్తూ, నిత్యమూ తాను కుంచించుకుపోతూ, క్షీణిస్తున్న పశ్చిమదేశాలకి నీవు మేలుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ భారతదేశమా! పడమర దేశాలన్నీ నీకు, నీ ఆదిజ్ఞానానికీ ప్రణమిల్లుతున్నాయి.


భారతీయ ఔన్నత్యం ..... కౌంట్ హెర్మన్ కెసర్లింగ్

భారతీయ కవులు, చింతనాపరులు, ప్రజానాయకులతో సమానమైన వాళ్ళు యూరప్ లో కానీ, అమెరికాలో కానీ నేడు లేరు. అంతేకాదు - వాళ్ళ దరిదాపులకు వచ్చేవాళ్ళు కూడా లేరు.


భారతీయ ఔన్నత్యం ..... కార్ల్ జంగ్

కాలానికి తట్టుకొని నిలబడిన గొప్ప నాగరికతలు హిందూ, చైనా నాగరికతలు. ఈ రెండూ అద్భుతమైన క్రమశిక్షణతో కూడి ఆత్మజ్ఞానం అనే పునాదుల మీద నిర్మింపబడి వృద్ధి చేయబడినవి. ఉన్నతమైన తత్వజ్ఞానం, అనుష్ఠానం, భారతీయ నాగరికతను మరింత శ్రద్ధగా, పవిత్రంగా చేశాయి.